చంటి ఛానల్, బోధన్: కనుమ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మటన్ విక్రయాలు భారీగా సాగాయి. ఉదయం 04 గంటల నుంచే మాంసం ప్రియులతో మటన్ షాపులు కిటకిటలాడాయి. పండుగ పూట ప్రజలు ఎక్కడా వెనకాడకుండా మాంసం కొనుగోలు చేయడంతో రోజంతా అమ్మకాలు జోరుగా సాగాయి. కిలో మటన్ ధర 900 రూపాయలు పలుకుతున్నప్పటికీ, వినియోగదారుల రద్దీ దృష్ట్యా వ్యాపారులు ముందస్తుగానే మేకలను సిద్ధం చేసి ఉంచారు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాంసం అందుబాటులో ఉండటంతో పట్టణంలో పండుగ వాతావరణం ఉత్సాహంగా కనిపించింది.

