చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజా సర్వే గణాంకాల ప్రకారం, మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 15 నుండి 18 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ అతిపెద్ద శక్తిగా అవతరించే దిశగా కనిపిస్తోంది. మరోవైపు MIM పార్టీ 10 నుండి 12 స్థానాల్లో పట్టు సాధించి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో బలంగా ఉన్న BRS పార్టీ కేవలం 3 నుండి 5 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుండగా, BJP 0 నుండి 2 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. ఇతరులు ఒక స్థానంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి బోధన్ మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో కాంగ్రెస్, MIM పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది.

