చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని ఉషోదయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు ఉన్న అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత సెల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యం వైపు సాగాలని సూచించారు. విద్యార్థుల డ్యాన్సులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఎస్హెచ్వో వెంకటనారాయణ, చైర్మన్ సూర్య ప్రకాష్, ఎండి దుశాంత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

