Explore

Search

November 7, 2026 6:12 pm

ఉర్దూ మీడియం పాఠశాలలో జామెంట్రీ బాక్సుల పంపిణీ

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని దారులూమ్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏకేజీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు సుల్తాన్, చిత్రాల ప్రమోద్ (చిన్న), అర్షద్ పాషాలతో పాటు సామాజిక కార్యకర్త సనా పటేల్మ, పాఠశాల హెడ్ మాస్టర్ రవూఫ్ పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి మరియు వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న సొసైటీ ప్రతినిధులను ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్