Explore

Search

November 7, 2026 6:22 pm

ఉద్రిక్తత: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకుని ‘గో బ్యాక్’ అంటూ భారీ నినాదాలు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులనే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, గత రెండేళ్లుగా బోధన్ అభివృద్ధిని విస్మరించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా తన మీదకు రావడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కంగుతిన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనతో బోధన్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్