Explore

Search

November 7, 2026 6:12 pm

అందాపూర్ శివారులో పోలీసుల మెరుపు దాడి: ఏడుగురు జూదగాళ్ల అరెస్ట్.

చంటి ఛానల్,నిజామాబాద్:  పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం బోధన్ రూరల్ మండలం అందాపూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సీసీఎస్ బృందం మెరుపు దాడి చేసింది. సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనలతో ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్ఐ విఠల్ మరియు సిబ్బంది జరిపిన ఈ దాడిలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 5,250 నగదు, 8 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల నిమిత్తం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్