Explore

Search

November 7, 2026 6:10 pm

సూది గుచ్చించుకో.. తులం బంగారం పట్టుకో: బోధన్‌లో వింత దందా!

చంటి ఛానల్, బోధన్: క్లినిక్ బోర్డు తీసేసి ‘లక్కీ డ్రా సెంటర్’ అని పెడితే సరిపోయేదానికి.. మధ్యలో ఈ ట్రీట్మెంట్లు, స్టెతస్కోప్ హంగామా ఎందుకో బోధన్‌లోని ఆ డాక్టర్‌కే తెలియాలి! “మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే లక్కీ డ్రాలో తులం బంగారం మీ సొంతం” అంటూ పెట్టిన బంపర్ ఆఫర్ చూసి రోగాలు కూడా బిత్తరపోతున్నాయి. రోగం నయమవుతుందో లేదో అన్న సంగతి దేవుడెరుగు కానీ, ‘ఏమో మన టైమ్ బాగుండి తులం బంగారం తగిలినా తగలొచ్చు’ అని జనం పోటీపడి మరీ ఫీజులు సమర్పించుకుంటున్నారు. మందుల చీటీలతో పాటు లక్కీ కూపన్లు తెంపి చేతిలో పెడుతున్న తీరు చూసి స్థానికులు ముద్దుగా “తులం బంగారం డాక్టర్” అని బిరుదిచ్చేశారు. రోగుల బలహీనతను క్యాష్ చేసుకుంటూ పవిత్ర వైద్యాన్ని కాస్తా పక్కా బంగారు వ్యాపారంగా మార్చేసిన ఆ డాక్టర్ గారి ఐడియాకి దండం పెట్టాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్