చంటి ఛానల్,నిజామాబాద్: నల్గొండ జిల్లా నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి సంతాపంగా, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రేపు (ఆగస్టు 21, శుక్రవారం) బోధన్ డివిజన్ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. బోధన్‌లోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రవర్తన తీరు మారాలని, ఉపాధ్యాయులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, కృష్ణమోహన్, దుశాంత్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

