చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో “వైద్యో నారాయణో హరి” కాస్తా “వైద్యో కమీషనో హరి”గా మారిపోయింది! ప్రాణాలు కాపాడాల్సిన ఓ డాక్టర్, అంబులెన్స్ డ్రైవర్ కి ఇవ్వాల్సిన ‘కమీషన్’ వాటాను ఎగ్గొట్టి అడ్డంగా బుక్కయ్యారు. తన వాటా రాక మండిపోయిన సదరు డ్రైవర్, నేరుగా హాస్పిటల్ కే వెళ్లి డాక్టర్ గారిని కాలర్ పట్టుకుని బయటకు లాగి మరీ దేహశుద్ధి చేశాడు. పవిత్రమైన వృత్తిలో ఉండి పైసల కోసం ఇలా బ్రోకర్లలా కక్కుర్తి పడితే, పగిలేది రోగుల జేబులు మాత్రమే కాదు.. డాక్టర్ల పరువు కూడా అని ఈ ఉదంతం రుజువు చేసింది. ఈ రేంజ్ కక్కుర్తి చూసి సీనియర్ డాక్టర్లు సిగ్గుతో ముక్కున వేలేసుకుంటుంటే.. వైద్య వృత్తి ఇలాగే వ్యాపారంగా కొనసాగితే, భవిష్యత్తులో హాస్పిటల్స్ అన్నీ వీధి రౌడీల పంచాయితీలకు అడ్డాలుగా మారడం ఖాయమని మేధావులు సెటైర్లు వేస్తున్నారు.

