చంటి ఛానల్, హైదరాబాద్: నీట్ (NEET) పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజ్ మద్దతు ప్రకటించారు, అయితే శాంతియుత నిరసనల ముసుగులో జరిగే హింస, ఆస్తుల ధ్వంసం, దేశ, ధర్మ వ్యతిరేక చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమస్యకు మతపరమైన అంశాలను జోడించి దేవుళ్లను అవమానించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని స్పష్టం చేసిన ఆయన, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సాగే ఉద్యమాలకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, “దేశం ముందుగా – విద్యార్థుల భవిష్యత్తు అత్యంత ప్రాధాన్యం” అని ఆయన ఉద్ఘాటించారు.

