Explore

Search

November 7, 2026 6:10 pm

​జిల్లా స్థాయి పరుగు పందెంలో శ్రీ సాయి ప్రసన్న పాఠశాల విద్యార్థుల సత్తా

చంటి ఛానల్, నిజామాబాద్: స్థానిక నాగారం స్టేడియంలో జూలై 7న అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల లోపు బాలబాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి 600 మీటర్ల పరుగు పందెంలో శ్రీ సాయి ప్రసన్న ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయి ప్రణీత్ ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చాడు. ఇదే పోటీలో చరణ్, అరవింద్, రాకేష్‌లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషిని, పట్టుదలను మెచ్చుకుంటూ, భవిష్యత్తులో వారు మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని పాఠశాల ప్రిన్సిపల్ పూదోట జయ ప్రకాష్ చిన్నారులను ఆశీర్వదిస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్