చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో సబ్ ఆర్డినేట్లే ‘కలెక్షన్ ఏజెంట్లు’గా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులకు మామూళ్లు అందజేస్తున్న భారీ లంచాల నెట్వర్క్ను ఏసీబీ గుర్తించింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఒక ప్రొఫార్మాను సిద్ధం చేసిన అధికారులు, ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లు, పాన్ నంబర్ల వివరాలను అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేశారు. 2012 తరహాలో ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న ఏసీబీ, ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ రాగానే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మెరుపుదాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

