Explore

Search

November 7, 2026 6:10 pm

​’సే నో టు డ్రగ్స్ – సే ఎస్ టు లైఫ్’: బోధన్‌లో విద్యార్థులకు పోలీసుల అవగాహన

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో పోలీస్ శాఖ జూన్ 22 నుండి 26 వరకు చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా, బోధన్‌లోని ఇందూర్ హైస్కూల్‌లో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ‘సే నో టు డ్రగ్స్ – సే ఎస్ టు లైఫ్’ అని పిలుపునిచ్చిన ఆయన, డ్రగ్స్ సమాచారం కోసం 1908 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, సీఐ విజయబాబు, ఎస్సై రాజశేఖర్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్,కరస్పాండెంట్ శ్రీనివాస్, చైర్మన్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్