Explore

Search

November 7, 2026 6:45 pm

తెలంగాణ 10K రన్‌లో బోధన్ విద్యార్థి అద్భుత ఘనత!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని క్రీసెంట్ హైస్కూల్ కు చెందిన తొమ్మిదేళ్ల విద్యార్థి ఎండీ అబూబకర్ సిద్ధిఖీ రాష్ట్ర స్థాయి క్రీడల్లో అరుదైన ఘనత సాధించాడు. జూన్ 7, 2026న తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘అవంతిక తెలంగాణ 10K రన్’ పోటీల్లో పాల్గొన్న ఈ చిన్నారి, కేవలం 55 నిమిషాల 42 సెకన్లలో 10 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇంత చిన్న వయసులో అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమతో పతకం సాధించడంపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని తెలుపుతూ, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం అబూబకర్ సిద్ధిఖీని ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్