చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కొత్త పాఠశాలల ఏర్పాటును ఆసరాగా చేసుకుని హైదరాబాద్కు చెందిన ఓ విద్యాశాఖ ఉద్యోగి భారీ అవినీతికి తెరలేపారు. “రూ.14 లక్షలు ఇస్తే అధికారులందరినీ మేనేజ్ చేసి పర్మిషన్లు ఇప్పిస్తా” అంటూ దళారుల ద్వారా బేరసారాలకు దిగడం సర్వత్ర తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, “మేము విద్యాబోధన చేయడానికి వస్తున్నాం తప్ప, వ్యాపారం చేయడానికి కాదు” అని స్పష్టం చేస్తూ పలు యాజమాన్యాలు ఈ దళారుల బేరసారాలను గట్టిగా తిప్పికొడుతున్నాయి. పవిత్రమైన విద్యావ్యవస్థను తమ స్వార్థం కోసం కలుషితం చేస్తూ అడ్డదారిలో డబ్బులు దండుకుంటున్న ఇలాంటి అవినీతి ఉద్యోగిపై ప్రభుత్వం తక్షణమే ఉక్కుపాదం మోపాలని విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయి.

