Explore

Search

November 7, 2026 6:31 pm

మహారాష్ట్ర ఇసుక మాఫియా బరితెగింపు: జాయింట్ సర్వేకు రాని అధికారులు

చంటి ఛానల్, నిజామాబాద్: సాలూర మండలం హుంసా, ముంజిరా సరిహద్దుల వద్ద తెలంగాణ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యారు. ఈ సర్వేలో పాల్గొనాల్సిన మహారాష్ట్ర రెవెన్యూ, సర్వే అధికారుల కోసం తెలంగాణ యంత్రాంగం ఉదయం నుంచి తీవ్రంగా ఎదురుచూస్తున్నప్పటికీ.. ఉదయం 10:30 గంటలవుతున్నా వారు ఇంకా ఘటనా స్థలానికి చేరుకోలేదు. ఒకపక్క అధికారుల సర్వేకు రంగం సిద్ధమవుతున్నా ఏమాత్రం భయం లేకుండా మహారాష్ట్ర ఇసుక మాఫియా బరితెగించి ప్రవర్తిస్తోంది. సర్వే జరుగుతోందన్న విషయాన్ని సైతం ఏమాత్రం లెక్కచేయకుండా వారి భూభాగంలో యథేచ్ఛగా ఇసుకను తవ్వుతున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద అధికారులు ఉన్నారన్న పట్టింపు కూడా లేకుండా, అక్రమ రవాణాను ఆపకుండా బహిరంగంగానే ఇసుకను దోచేస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్