చంటి ఛానల్,నిజామాబాద్: వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో బోధన్ పట్టణంలోని మురికివాడల్లో తక్షణమే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, లేనిచో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు రోగాల బారిన పడతారని సీపీఐ నాయకులు హెచ్చరించారు. ఒకటో వార్డు ఆటోనగర్‌లో సీపీఐ సీనియర్ నాయకుడు నాగళ్ళ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా, పట్టణ కార్యదర్శులు పి. సుధాకర్, రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు మురికివాడల అభివృద్ధికి కృషి చేయాలని, తాగునీరు, వీధిలైట్లు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, వైద్యం కోసం పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అలీతో పాటు పలువురు పార్టీలో చేరగా, ఒకటో వార్డు నూతన కార్యదర్శిగా సంతోష్, సహాయ కార్యదర్శిగా లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సాయిలు, రామకృష్ణ, కృష్ణ, సలీం, మన్నన్ తదితరులు పాల్గొన్నారు.

