చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్‌లోని ఇందూర్ B.Ed కాలేజీ ప్రిన్సిపాల్ R.అప్పలనాయుడు రాజస్థాన్‌లోని శ్రీధర్ యూనివర్సిటీ నుండి PhD పట్టా అందుకున్నారు. డాక్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో “సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం” అనే అంశంపై 4 ఏళ్ల పాటు పరిశోధన చేసి, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 2400 మంది ఉపాధ్యాయుల నుండి నమూనాలు సేకరించి ఆయన ఈ విజయాన్ని సాధించారు. గత 26 ఏళ్లుగా విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న ఆయనకు 2026 మే 23న ఈ డాక్టరేట్ లభించడం పట్ల కాలేజీ మేనేజ్మెంట్, అధ్యాపకులు, విద్యార్థులు,కుటుంబ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

