చంటి ఛానల్,బోధన్: సాలూర మండలం మందర్నా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఏఎంసీ చైర్మన్ శంకర్, ఎమ్మార్వో నవాజ్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్,ఇతర అధికారులు కలిసి ప్రారంభించారు. సొంతింటి కలను సాకారం చేసి, తమకు ఆత్మగౌరవాన్ని కల్పించిన ప్రజా ప్రభుత్వానికి లబ్ధిదారులు మల్లెపూల దేవ్ భాయ్, సిరిసే పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మందర్నా రవి, సర్పంచ్ సావిత్రి గంగాధర్, హౌసింగ్ అధికారులు,గ్రామస్తులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

