చంటి ఛానల్,నిజామాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జాతీయ అధ్యక్షురాలు మాయావతి, ఆకాష్ ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పార్టీ పటిష్ట నిర్మాణం కోసం నూతన కమిటీని నియమించారు. జిల్లా అధ్యక్షులు సింగాడే పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జీలుగా బాగరే గంగాధర్, రమేష్ దాస్, అధ్యక్షుడిగా రెడ్డి సాయిలు, ఉపాధ్యక్షుడిగా MD విపురుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా కె. చంద్రశేఖర్, కార్యదర్శిగా బైరి కిరణ్, కోశాధికారిగా కంచ భూమేష్, ఈసీ మెంబర్‌గా రవి మరియు పట్టణ అధ్యక్షుడిగా సుభాష్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి గ్రామంలో కమిటీలను వేగవంతం చేయాలని, మండలం నుండి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

