చంటి ఛానల్,బోధన్: ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, “శాంతియే నిజమైన విజయం” అనే నినాదంతో విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాసు యార్లగడ్డ బోధన్ పట్టణమంతటా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిణామాల వల్ల భారత్ వంటి దేశాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రస్తావిస్తూ, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ శాంతిని కోరుతూ ఆయన చేపట్టిన ఈ ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ‘సర్వే జనాః సుఖినో భవంతు’ అనే భారతీయ సంస్కృతిని చాటుతూ, శాంతి స్థాపన మన నుండే ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

