Explore

Search

November 7, 2026 6:21 pm

బోధన్ స్కూల్స్ స్వీప్: పది ఫలితాల్లో మెరిసిన ప్రతిభావంతులు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణ, పరిసర ప్రాంతాల పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విద్యాసంస్థల పేరును మారుమోగించారు. ముఖ్యంగా విజయసాయి పాఠశాలకు చెందిన ఎస్. భవాని, ఎ. సాయి దీక్షిత్ 587 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఇందూర్ పాఠశాలకు చెందిన ఎస్. రాంచరణ్ (583), వంశీ పాఠశాల విద్యార్థిని జె. శ్రేష్ట (583), మెట్రిక్స్ స్కూల్ విద్యార్థి సి.హెచ్. శ్రీరామ్ కృష్ణ (581) అత్యుత్తమ మార్కులతో సత్తా చాటారు. అలాగే సాయి ప్రసన్న, మాతృశ్రీ, వాణి విద్యానికేతన్, లయోలా, నారాయణ వంటి పాఠశాలల విద్యార్థులు కూడా భారీ స్కోర్లతో విజయం సాధించారు. కోటగిరి ప్రాంతంలో యశశ్రీ, వేద పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి గుర్తింపు పొందారు. విద్యార్థుల ఈ విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ బోధన్‌లోని ఉషోదయ, విద్యావికాస్, విజేత, విజయసాయి, ప్రజ్ఞా జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు, ఆయా పాఠశాలల నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్