చంటి ఛానల్, నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మూడవ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు క్షేత్రస్థాయిలో డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొబైల్ యాప్ల ద్వారా వివరాల నమోదు, సాంకేతిక సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. సర్వే ప్రక్రియను పారదర్శకతతో, నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని, సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు డేటాను తనిఖీ చేస్తూ తప్పులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు.

