Explore

Search

November 7, 2026 6:11 pm

లవ్ జిహాద్ ట్రాప్ & కర్రసాము.. బోధన్ శిబిరంలో బాలలకు ‘పవర్ ఫుల్’ పాఠాలు!

చంటి ఛానల్,బోధన్: నేటి సమాజంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఆర్య సమాజం, దయానంద గోశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సదాచార శిక్షణ శిబిరం’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ శిబిరంలో ముఖ్యంగా ‘లవ్ జిహాద్’ వంటి సామాజిక ముప్పుల పట్ల బాలికలకు కళ్లు తెరిపించేలా అవగాహన కల్పిస్తూనే, మరోవైపు శారీరక, మానసిక దృఢత్వానికి పెద్దపీట వేస్తున్నారు. నిష్ణాతులైన పండితుల పర్యవేక్షణలో యోగాసనాలు, ప్రాచీన యుద్ధ కళ అయిన ‘కర్రసాము’, వేద విజ్ఞానం, దేశభక్తిపై శిక్షణ ఇస్తున్నారు. మాతృ-పితృ భక్తితో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చడం ద్వారా పిల్లలు ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, తమను తాము రక్షించుకునేలా తీర్చిదిద్దుతున్నామని ప్రదీప్ గుప్తా, మాధవి,  నిర్వాహకులు తెలిపారు. ధర్మం, సంస్కృతి, ఆత్మరక్షణ విద్యల కలయికగా సాగుతున్న ఈ శిబిరం రేపటి బాధ్యతాయుత పౌరుల నిర్మాణానికి వేదికగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్