Explore

Search

November 7, 2026 6:31 pm

సొంతింటి కల సాకారం: ఖాజాపూర్‌లో వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం!

చంటి ఛానల్,సాలూర: మండలంలోని ఖాజాపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ ఇంటిని ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, తహసీల్దార్ అజ్మాత్ నవాజ్, ఎంపీడీవో శ్రీనివాస్ కలిసి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని లబ్ధిదారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శివ సాయి, సర్పంచ్ చింతం నాగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవి, డిసిసి సెక్రెటరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇచ్చినందుకు లబ్ధిదారులు అధికారులను, నాయకులను శాలువాలతో సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్