Explore

Search

November 7, 2026 6:44 pm

భూమాతను రక్షించుకుందాం: ఇందూర్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

చంటి ఛానల్,బోధన్: అంతర్జాతీయ భూమాత దినోత్సవం సందర్భంగా శనివారం ఆచన్ పల్లిలోని ఇందూర్ B.Ed, D.El.Ed కళాశాలల ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NGC ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ ఆర్. అప్పలనాయుడు పాల్గొని ప్రసంగించారు. మానవ మనుగడకు ఆధారమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం మరియు నీటిని ఆదా చేయడం ద్వారా ప్రకృతిని సంరక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చంద్రకాంత్, అవినాష్ కీర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్