Explore

Search

November 7, 2026 6:21 pm

సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాల భారీ నిరసన

చంటి ఛానల్, బోధన్: తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం (TGEJAC) ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి పత్రం అందజేస్తూ.. ప్రధానంగా 51 శాతం ఫిట్మెంట్‌తో పీఆర్సీ (PRC) అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ మెరుగైన హెల్త్ కార్డులు వర్తింపజేయడంతో పాటు, సిపిఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, అలాగే 1-9-2004 కంటే ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో TGEJAC అధ్యక్షులు కార్తీక్, TRSA బాధ్యులు విట్టల్, PRTU నాయకులు శంకర్, థామస్, STU నాయకులు నెమలి సంజీవ్, సలీం, పెన్షనర్ల సంఘ అధ్యక్షులు రాజేశ్వరరావు, TNGO నాయకులు సాయిలు, శ్వేతతో పాటు సుమారు 100 మంది వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్