Explore

Search

November 7, 2026 6:06 pm

జ్ఞాన సూర్యుడికి నీరాజనం: సాలూరలో ఘనంగా నివాళులు

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ లావణ్య రవి, ఈ.శంకర్, కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంటరానితనం వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని, విద్య ద్వారానే తలరాతలు మారుతాయని నిరూపించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై భీమ్ దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన పాండు, లక్ష్మణ్ తేజ్లను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లే జనార్ధన్, అల్లే రమేష్, కేజీ గంగారం, షకీల్, డిస్కో సాయిలు, ఉపసర్పంచ్ సురేష్, ప్రజ్ఞ శ్రీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్