చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలంలో అబ్కారీ శాఖ నిబంధనలు ‘కల్లు’ తాగిన కోతిలా తూలుతున్నాయి; పాలు తాగాల్సిన పసివాడు కల్లు సీసా పట్టుకుని గటగటా తాగేస్తుంటే, మన ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు ‘కుంభకర్ణ’ నిద్రపోతున్నారు. “మైనర్లకు అమ్మరాదు” అనే బోర్డులు కేవలం బల్లి రెట్టలు వేయడానికే తప్ప, నిర్వాహకుల లాభార్జన ముందు అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. డబ్బులు వస్తే చాలు, వచ్చేవాడు పిల్లాడా లేక పితామహుడా అన్న విచక్షణ మరిచిన బట్టీ యజమానులకు, కనీసం నిబంధనల మీద ‘అవగాహన’ కల్పించే తీరిక కూడా మన అధికారులకు లేకపోవడం గమనార్హం. ప్రజాసంఘాలు గొంతు చించుకుంటున్నా, అధికారుల మత్తు వదలడం లేదు..బహుశా ఆ మత్తు దిగాలంటే పసిపిల్లలు స్కూల్ బ్యాగులకు బదులు కల్లు బుడ్లు తగిలించుకుని తిరిగే దాకా ఆగాలేమో అని స్థానికులు ఎటకారంగా నవ్వుకుంటున్నారు.

