Explore

Search

November 7, 2026 6:21 pm

జనగణన పేరుతో మోసం: మహిళను బంధించి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు.

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. జనగణన (Census) అధికారులమని నమ్మబలికి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు, అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి. అనంతరం ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారాన్ని అపహరించి పరారయ్యారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు అధికారులమని చెప్పి వస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్