చంటి ఛానల్,బోధన్: పట్టణానికి చెందిన బిఆర్ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్లోని బోధన్ ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. వార్డుల అభివృద్ధికి తప్పనిసరిగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇలియాస్, అశోక్ రెడ్డి, ముషీర్ బాబా, సమీర్ తదితరులు పాల్గొన్నారు.

