చంటి ఛానల్,నిజామాబాద్: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించి, 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నకిలీ ధృవపత్రాలతో కర్ణాటక బ్యాంక్లో కరెంట్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయించిన ఈ ముఠా, కేవలం మూడు నెలల్లోనే సుమారు రూ.152 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పత్రాల ధృవీకరణలో నిర్లక్ష్యం వహించిన బ్యాంకు అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు.

