Explore

Search

November 7, 2026 6:20 pm

వడగళ్ల వాన బాధితులను ఆదుకోవాలి: మేడపాటి ప్రకాష్ రెడ్డి

చంటి ఛానల్,బోధన్: సాలూర మండలంలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాల్లో అకాల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట నష్టంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం అందించి, పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందగట్ల రాంచందర్, గంగాధర్, ఇంద్రకరణ్, ఇర్వంత్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్