Explore

Search

November 7, 2026 6:20 pm

సాలూర మండలం: పెళ్లయితే అయింది కానీ.. పెళ్లికొడుకే లేడు!

చంటి ఛానల్,సాలూర: 30 ఏళ్ల పాటు ముక్కుపిండి, కొట్లాడి సాధించుకున్న సాలూర మండలం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. “పెళ్లి అయితే అయింది కానీ, పెళ్లికొడుకు మాత్రం పీటల మీద ఆగడం లేదు” అన్నట్టు తయారైంది! మండలం వస్తే మా బతుకులు మారుతాయని, బోధన్ దాకా వెళ్లే చెప్పుల అరుగుదల తగ్గుతుందని ఆశపడ్డ ప్రజలకు ఇప్పుడు కొత్త తిప్పలు మొదలయ్యాయి. ఇక్కడ ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో కుర్చీలు ఉన్నాయి కానీ, వాటిలో కూర్చునే అధికారులు మాత్రం ‘గెస్ట్ రోల్’ పోషిస్తున్నారు. ఏ అధికారి వచ్చినా ఆరు నెలలు తిరక్కుండానే “నేను వెళ్లొస్తా తమ్ముడూ” అంటూ ప్యాకప్‌ చెప్పేస్తుండటంతో, ఇక్కడ పాలన కాస్తా ‘మ్యూజికల్ చైర్స్’ ఆటలా మారిపోయింది. ఇన్ఛార్జ్ అధికారుల పుణ్యమా అని ఫైళ్లు కదలక, పనులు జరగక ప్రజలు పిచ్చెక్కిపోతుంటే.. “మండలం వచ్చిందని పండగ చేసుకోవాలా? లేక ఏ అధికారి ఇక్కడ నిలకడగా ఉండటం లేదని ఏడవాలా?” అని సాలూర జనం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మా మండలం మీద కనికరం చూపి, కనీసం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండే ‘పర్మినెంట్’ అధికారులను పంపాలని, లేదంటే మా మండల అభివృద్ధి గాలిలో దీపంలా మారుతుందని మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్