Explore

Search

November 7, 2026 6:10 pm

రైతు నేత కేజీ గంగారాంకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం.

చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ రైతు కేజీ గంగారాం ప్రతిష్టాత్మక ‘పుడమిపుత్ర’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గత 35 ఏళ్లుగా వరి, చెరకుతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తూ వ్యవసాయంలో తనదైన ముద్ర వేసిన ఆయన కృషిని గుర్తించి వసుంధర విజ్ఞాన వికాస మండలి, వైద్యుల విజ్ఞాన వేదిక ఈ పురస్కారాన్ని ప్రకటించాయి. కేవలం రైతుగానే కాకుండా, రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలపై, ముఖ్యంగా పంట కొనుగోలు కేంద్రాలు, పరిహారం, రైతుబీమా వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ‘రైతు ఉద్యమకారుడి’గా ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖుల చేతుల మీదుగా ఆయనకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సన్మానించనున్నారు. ఈ గౌరవం దక్కడం పట్ల గంగారాం హర్షం వ్యక్తం చేస్తూ, తనకు సహకరించిన రైతులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్