చంటి ఛానల్, బోధన్: శక్కర్ నగర్ లోని హనుమాన్ వ్యాయామశాలలో హనుమాన్ దీక్షా స్వాములకు నిర్వహించిన మహా భిక్ష కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్ (VHP) జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ, బోధన్ యొక్క ప్రాచీన చారిత్రక వైభవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బోధన్‌లోని చారిత్రాత్మక వంద స్థంభాల ఆలయ పునర్నిర్మాణం కోసం హిందూ సమాజమంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం, యోగ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహరాజ్ నివాసాన్ని సందర్శించి ధార్మిక అంశాలపై చర్చించిన ఆయన, ఫౌండేషన్ నిర్వహిస్తున్న ధర్మ కార్యాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

