Explore

Search

November 7, 2026 6:20 pm

గ్యాస్ ‘బ్లాక్’ దందా: సిలిండర్ రూ. 2000!

చంటి ఛానల్ ,నిజామాబాద్:  బోధన్ పట్టణంలో గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా పరాకాష్టకు చేరింది. కమర్షియల్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ, సామాన్య ప్రజలకు అందాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఏకంగా రూ. 1600 నుండి రూ. 2000 వరకు విక్రయిస్తూ అక్రమార్కులు కాసుల వేటలో పడ్డారు. “బురదలో చేపలు పట్టినట్లుగా” ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్న కొన్ని ఏజెన్సీల తీరుపై ప్రజాసంఘాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఈ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టి, బాధ్యులైన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్