చంటి ఛానల్,బోధన్: రాబోయే ఎస్‌ఎస్‌సీ – 2026 పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) వినతిపత్రం సమర్పించారు.ఏ రోజు ఏ సబ్జెక్ట్ పరీక్ష ఉంటుందో, ఆ రోజు ఆ సబ్జెక్ట్ టీచర్‌ను పరీక్షా కేంద్రం భవనంలోకి కూడా అనుమతించకూడదని, కనీసం క్లర్క్ విధుల్లో కూడా ఉంచవద్దని ఆయన కోరారు. ఇటువంటి కఠిన నిబంధనల వల్ల కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

