Explore

Search

November 7, 2026 6:20 pm

​”నేతల స్వార్థానికి ‘తహసీల్దార్’ బలి: నిజామాబాద్ జిల్లా ఇసుక దందాలో అధికారి ఒంటరి పోరాటం!”

చంటి ఛానల్,నిజామాబాద్: జిల్లాలో ఓ మండల తహసీల్దార్ పరిస్థితి ఇప్పుడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” అన్నట్లుగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు, యూనియన్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, నిబంధనలకు విరుద్ధంగా లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చిన సదరు అధికారి ఇప్పుడు నట్టేట మునిగిపోయారు.​”మేమున్నాం.. చూసుకుంటాం” అని అప్పట్లో భరోసా ఇచ్చిన రాజకీయ నాయకులు, ఫిర్యాదులు పైస్థాయికి వెళ్లగానే మెల్లగా జారుకున్నారు. తప్పు చేసినా తమను కాపాడతారని నమ్మిన ఆ తహసీల్దార్‌ను ఇప్పుడు అందరూ అనాథగా వదిలేశారు. అనుమతి లేని పాయింట్ల నుంచి ఇసుక తరలింపుపై విచారణ సెగ తగులుతుండటంతో, తన ఉద్యోగం ఊడుతుందేమోనన్న ఆందోళనలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కేవలం ఒక అధికారి కథ మాత్రమే కాదు.. రాజకీయ నాయకుల స్వార్థం కోసం తమ సంతకాలను, ఉద్యోగాలను తాకట్టు పెడితే చివరకు బలిపశువులయ్యేది అధికారులేనని చెప్పడానికి ఇదొక కళ్లు తెరిపించే నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్