Explore

Search

November 7, 2026 6:21 pm

​మందు బాబులకు చుక్కలు చూపించిన నిజామాబాద్ పోలీసులు: రూ. 20 లక్షల జరిమానా!

చంటి ఛానల్, నిజామాబాద్: గత రెండు వారాల్లో (ఫిబ్రవరి 23 నుండి మార్చి 7 వరకు) నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో 246 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరికి కోర్టు రూ. 20,30,000/- భారీ జరిమానా విధించడమే కాకుండా, 16 మందికి వారం రోజుల జైలు శిక్ష ఖరారు చేసినట్లు సి.పి. శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీస్ శాఖ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్