చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని విజయసాయి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోధన్ మండల విద్యాశాఖాధికారి (MEO) నాగయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులపై నిరంతర శ్రద్ధ చూపిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ముఖ్య అతిథి నాగయ్య గారు మాట్లాడుతూ.. విద్యార్థులకు సెల్ ఫోన్లను దూరంగా ఉంచాలని, వారి ప్రవర్తనను ఉపాధ్యాయులు నిరంతరం గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఐదవ తరగతి విద్యార్థిని మనోజ్ఞ దేశాయిని ‘బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్’గా ఎంపిక చేసి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కల్పన, అకడమిక్ ఇంచార్జ్ ప్రసన్న, హైస్కూల్ విభాగం నుండి చక్రవర్తి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

