Explore

Search

November 7, 2026 6:21 pm

మున్సిపల్ చైర్‌పర్సన్‌ దంపతులకు 18వ వార్డు ప్రజల ఘన సన్మానం

చంటి ఛానల్,బోధన్: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తూము పద్మ శరత్ రెడ్డి దంపతులను 18వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు వాసులు చైర్‌పర్సన్ దంపతులకు శాలువా కప్పి, పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి సహకరించాలని వారు కోరగా, పట్టణాభివృద్ధిలో భాగంగా అన్ని వార్డుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రాల ప్రమోద్ చిన్న, సుబ్బారావు, రమణ, నరసరాజు, నాగమురళి, సునీత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్