చంటి ఛానల్, బోధన్: సాలూర మండల కేంద్రంలోని రైతు వేదిక నిర్వహణ లేక వెక్కిరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భవనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అశుభ్రంగా మారి, చిందరవందరగా తయారైంది. ఎంతో ఉపయోగకరంగా ఉండాల్సిన రైతు వేదిక ఇప్పుడు అపరిశుభ్రతకు నిలయంగా మారడంపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా వీలులేని విధంగా తయారైన ఈ భవనాన్ని వెంటనే శుభ్రం చేయించి, మెయింటెనెన్స్ పక్కాగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

