చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదని, ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పని చేసే ‘చేతల చైర్మన్’ అని నిరూపించుకున్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన స్ప్రేయింగ్ కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొన్నారు.కేవలం అధికారులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా, స్వయంగా స్ప్రే గన్ పట్టుకుని దోమల మందును స్ప్రే చేయడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ జాదవ్,వార్డు కౌన్సిలర్ జహీర్ అహ్మద్మ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మున్సిపల్ చైర్ పర్సన్ హోదాలో ఉండి కూడా సామాన్య కార్యకర్తలా డ్రైనేజీల వద్ద స్ప్రేయింగ్ చేయడంతో స్థానిక ప్రజలు ఆమె పనితీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

