Explore

Search

November 7, 2026 6:30 pm

చంటి ఛానల్ ఎఫెక్ట్: కదిలిన గురుకుల యంత్రాంగం!

చంటి ఛానల్ ,బోధన్: ఇంటర్మీడియట్ పరీక్షల వేళ బోధన్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలపై ‘చంటి ఛానల్’ ప్రసారం చేసిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం 149 మంది విద్యార్థినులను కేవలం రెండు ఆటో వ్యాన్లలో, పరిమితికి మించి ప్రమాదకర రీతిలో తరలిస్తున్న వైనాన్ని ఛానల్ ఎత్తిచూపడంతో అధికారులు తక్షణమే స్పందించారు. గతంలో రెండు వాహనాలు మూడు ట్రిప్పులు తిరగాల్సి రాగా, తాజాగా అదనంగా మరో వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల రద్దీ తగ్గి విద్యార్థినులకు కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ, తొమ్మిది పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను విడివిడిగా తరలించే బదులు, ఒకే బస్సును ఏర్పాటు చేస్తే బాధ్యతాయుతంగా ఉంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏదేమైనా, విద్యార్థుల భద్రతను గుర్తించి స్పందించిన అధికారులకు, విషయాన్ని వెలుగులోకి తెచ్చిన చంటి ఛానల్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్