చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థినులను వేధిస్తున్న ఒక ఆకతాయిని షీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని బోధన్ ఎస్‌హెచ్‌వో (SHO) వెంకటనారాయణ ముందు హాజరుపరచగా, అతనిపై కేసు నమోదు చేసి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు ప్రవేశపెట్టారు. కేసును విచారించిన న్యాయమూర్తి సదరు యువకుడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా బోధన్ పోలీసులు హెచ్చరిస్తూ.. పట్టణంలో ఆడపిల్లలను వేధించే వారిపై షీ టీమ్ నిరంతరం నిఘా ఉంచుతుందని, ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

