Explore

Search

November 7, 2026 6:20 pm

“మున్సిపాలిటీలో ముదిరిన ‘కో-ఆప్షన్’ వార్.. కాంగ్రెస్ కోటలో మజ్లిస్ పంజా!”

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న నాలుగు కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, ఓటమి పాలైన అభ్యర్థులు ఈ పదవుల ద్వారా తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ముమ్మరంగా పైరవీలు చేస్తున్నారు. ముఖ్యంగా బోధన్‌లో మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గతంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన మజ్లిస్ (MIM) పార్టీ, ఇప్పుడు ప్రతిఫలంగా రెండు కో-ఆప్షన్ స్థానాలు తమకే కేటాయించాలని పట్టుబడుతోంది. ఇది స్థానిక కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పైగా మజ్లిస్ రెండు సీట్లు డిమాండ్ చేస్తుండటంతో ఎవరిని సంతృప్తి పరచాలో తెలియక జిల్లా కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. సామాజిక సేవా నేపథ్యం, రిటైర్డ్ ఉద్యోగుల కోటాతో పాటు మైనారిటీ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉండటంతో, బోధన్ రాజకీయాల్లో ఈ ‘కో-ఆప్షన్’ పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్