Explore

Search

November 7, 2026 6:31 pm

మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు ఘన సన్మానం: ప్రశంసించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్ ,బోధన్: మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించినందుకు గాను బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్‌ను ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో కమిషనర్ చూపిన చొరవ, అధికారుల మధ్య సమన్వయం, క్రమశిక్షణతో కూడిన చర్యలే ఈ విజయానికి కారణమని కొనియాడారు. ప్రజల సహకారంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసిన సిబ్బందిని కూడా ఆమె అభినందిస్తూ, భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్