Explore

Search

November 7, 2026 6:31 pm

అట్టహాసంగా ‘KS Stitch Studio’ ప్రారంభం.. స్వయంగా షాపింగ్ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి!”

చంటి ఛానల్ ,బోధన్: పట్టణంలోని గోశాల రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘KS Stitch Studio’ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ స్టూడియోను ప్రారంభించారు.​అనంతరం ఆమె స్టూడియోలోని కొత్త వెరైటీ దుస్తులను పరిశీలించి, కొన్నిటిని ఎంపిక చేసుకొని షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేఎస్ టైలర్స్ ఎన్నో ఏళ్లుగా నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని, ఇప్పుడు సరికొత్త హంగులతో స్టిచ్ స్టూడియోగా విస్తరించడం సంతోషకరమన్నారు. ప్రజలకు మరిన్ని ఆధునిక డిజైన్లు అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్టూడియో యజమానులు కొట్టుర్ స్రవంతి శ్రీనివాస్ దంపతులు, మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులను ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్