చంటి ఛానల్,బోధన్: నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో, ‘బేటి బచావో – బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా బోధన్ ప్రాజెక్ట్ పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ స్కూల్లో యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా AR ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన ఈ సదస్సులో ట్రైనర్ అపర్ణ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకున్న లింగ వివక్షను తొలగించడంలో బాలుర పాత్ర కీలకమని, బాలికలతో సమానంగా హక్కులు మరియు గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని ఉదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, బాలలపై జరుగుతున్న దుర్వినియోగం వంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, యువత సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, DHEW సిబ్బంది పుష్ప తదితరులు పాల్గొన్నారు.

